CISF Recruitment for 137 Posts for 10th/ITI

0
387

సీఐఎస్‌ఎఫ్‌లో 137 పోస్టులు…

పదోతరగతి అర్హత
ఐటీఐ చేసినవారికి ప్రాధాన్యత
కేంద్ర కొలువులు, ఆకర్షణీయమైన జీతభత్యాలు
-సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టులు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: సీఐఎస్‌ఎఫ్‌ను 1969లో స్థాపించారు. 1.41 లక్షల మంది దీనిలో పనిచేస్తున్నారు. ఈ సంస్థ న్యూక్లియర్ ఇన్‌స్టాలేషన్స్, స్పేస్ సెంటర్స్, ఎయిర్‌పోర్ట్స్, పవర్ ప్లాంట్స్, నౌకాయాన కేంద్రాలు, కీలకమైన ప్రభుత్వ భవనాలు, వారసత్వ సంపద కేంద్రాలను పరిరక్షిస్తుంది. దేశవ్యాప్తంగా ఈస్టర్న్, వెస్టర్న్, నార్తర్న్, సదరన్, నార్త్ ఈస్టర్న్ సెక్టార్లను కలిగి ఉంది.
పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య – 137
బార్బర్ – 20, బూట్‌మేకర్ – 7, కుక్ – 44, మాలి – 2, పెయింటర్ – 3, స్వీపర్ – 25, వాషర్ మెన్ – 25. వీటితోపాటు ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీలో బార్బర్ -2, కుక్ – 5, స్వీపర్ – 3, వాషర్‌మెన్ – 3 ఖాళీలు ఉన్నాయి.
-ఈ పోస్టులు కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే కేటాయించారు.
-వయస్సు: 2016, ఆగస్టు 1 నాటికి 18 – 23 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. స్కిల్డ్ ట్రేడ్స్ అంటే బార్బర్, బూట్‌మేకర్, కుక్, పెయింటర్, మాలి, వాషర్‌మెన్ పోస్టులకు ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యతను ఇస్తారు.

Also Read :   Jobs in Kochin Internation Airport, East Coast Railway Apprentice, IFFCO Graduate Trainee

Click Here to Apply

For More Jobs


Warning: A non-numeric value encountered in /srv/users/serverpilot/apps/totelangana/public/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 326

LEAVE A REPLY